Konda Surekha: కేటీఆర్.. మా ప్రభుత్వం మైనారిటీలో లేదు: కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్

by Shiva |
Konda Surekha: కేటీఆర్.. మా ప్రభుత్వం మైనారిటీలో లేదు: కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో ఉప ఎన్నికలు (By-Elections) రావడానికి తమ ప్రభుత్వం మైనారిటీలో లేదని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు కేటీఆర్‌ (KTR)కు చురకలంటించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ (KTR) ప్రజలకు ఏం చేశారనే విషయంలో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని వమర్శించారు.

రైతు రుణమాఫీ (Farmer Loan Waiver) విషయంలో ప్రజల్లో లేనిపోని అనుమాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన నాయకుడు ప్రజల్లోకి ఎందుకు రావడం లేదని కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పదేళ్ల పాలన బీఆర్ఎస్ (BRS) పాలనలో వాళ్లు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేశామంటూ ఓ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసిందని గుర్తు చేశారు. ప్రజలకు తాము మంచి చేసినా.. ప్రధాన ప్రతిపక్షంగా సంతోషించాల్సింది పోయి.. ఓర్వకపోవడం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మూర్ఖత్వానికి పరాకాష్ట అని కొండా సురేఖ అన్నారు.

Advertisement

Next Story