కొండా సురేఖ ఎపిసోడ్ క్లోజ్ : కడియం సంచలన స్టేట్మెంట్

by Muthe.Rajitha |

ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కొండా సురేఖ ఎపిసోడ్ గురించి తెలిసిందే.

కొండా సురేఖ ఎపిసోడ్ క్లోజ్ : కడియం సంచలన స్టేట్మెంట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కొండా సురేఖ ఎపిసోడ్ గురించి తెలిసిందే. ఏకంగా సీఎం రేవంత్ తో సహా సొంతపార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్. పార్టీలో రెడ్డి నేతలతోసహా పలువురు కీలక లీడర్లు తన తల్లిదండ్రులపై కక్ష్య గట్టారని, కావాలని తమను వేధిస్తున్నారని సుష్మిత మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఆమె ఆరోపణలు చేసిన వారిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఈ వ్యవహారం ఢిల్లీ పెద్దల వరకూ వెళ్లినట్టు సమాచారం.

తర్వాత ఏం జరిగిందో గాని.. కొండా దంపతులు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆ సమస్యను పరిష్కరించుకున్నామని ప్రకటించుకున్నారు. ఇక అంతా ముగిసింది అనుకునేలోపు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేడు కొండా సురేఖపై సంచలన కామెంట్లు చేసారు. కొండా సురేఖ ఎపిసోడ్ ముగిసింది అని చెబుతూనే.. తాను ఎప్పుడూ రౌడీయిజం, గుండాయిజం, సెటిల్మెంట్లు చేస్తూ.. వసూళ్లకు పాల్పడలేదని పరోక్షంగా కొండా దంపతులను ఎద్దేవా చేసారు. ఇంతకుమించి ఏం మాట్లాడబోనని, ఇక ఆ గొడవ ముగిసినట్టేనని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Next Story