నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ సంచ‌ల‌న ట్వీట్ !

by velandi.Saikiran |

అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ సంచలన పోస్ట్ పెట్టారు.

నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ సంచ‌ల‌న ట్వీట్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ సంచలన పోస్ట్ పెట్టారు. గతంలోనే సమంత ఇష్యూను తీసుకువచ్చి, నాగార్జున ఫ్యామిలీపై హాట్ కామెంట్స్ చేసిన కొండా సురేఖ... నిన్న అర్ధరాత్రి మరో ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. గతంలో నాగార్జున, ఆయన ఫ్యామిలీపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు కొండా సురేఖ. నాగార్జున ఫ్యామిలీని కించపరచాలన్న ఉద్దేశం తనకు ఎక్కడ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

త‌న వ్యాఖ్య‌ల‌తో వారు బాధపడి ఉంటే, అందుకు చింతిస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ‌ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయం దాటిన తర్వాత కొండా సురేఖ ఈ సంచలన పోస్ట్ పెట్టారు. దీంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు కొండా సురేఖ ఇలా రియాక్ట్ అయినట్లు చర్చ జరుగుతోంది. కాగా ఇప్పటికే కొండా సురేఖ పై అక్కినేని నాగార్జున పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. మ‌రి కొండా సురేఖ తాజాగా చేసిన ట్వీట్ తో ఈ అంశానికి తెర‌ప‌డుతుందో ? లేదో? చూడాలి. క్లిక్

Next Story