మంత్రి సీతక్కతో విభేదాలపై కొండా సురేఖ క్లారిటీ

by Gantepaka Srikanth |
మంత్రి సీతక్కతో విభేదాలపై కొండా సురేఖ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ధనసరి అనసూయ(Seethakka)తో విభేదాలపై మరో మహిళా మంత్రి కొండా సురేఖ(Konda Surekha) స్పందించారు. శుక్రవారం సురేఖ మీడియాతో మాట్లాడారు. సీతక్కకు నాకు ఎలాంటి విభేదాలు లేవు. సమ్మక - సారలమ్మ(Sammaka - Saralamma) లాగా రాష్ట్రాభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తామని కీలక ప్రకటన చేశారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వ పథకాలతో వాళ్ల కార్యకర్తలకే లబ్ధి చేకూరిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని.. దీనిని ఓర్వలేక కొంతమంది బీఆర్‌ఎస్‌(BRS) నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సీరియస్ అయ్యారు.

అంతేకాదు.. దావోస్‌లో తెలంగాణకు ఎవరూ ఊహించని రేంజ్‌లో పెట్టుబడులు వచ్చాయని అన్నారు. గతేడాదితో పోలిస్తే నాలుగురెట్లు ఎక్కువగా రావడం హర్షించదగిన విషయమన్నారు. 16 ప్రముఖ కంపెనీలు సుమారు రూ.1.78 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 49,550 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఆశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌ తదితరులు దావోస్‌‌లో పర్యటించారు.



Next Story