- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Konda Murali: మా మద్దతుతో గెలిచి మాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు: కొండా మురళి సంచలన లేఖ
పీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి సంచలన లేఖ రాశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై కొండా మురళి సంచల వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ కమిటీని కలిసి కొండా మురళి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో క్రమశిక్షణ కమిటీకి ఆరు పేజీలతో కూడిన లేఖలో వివరించారు. ఈ సందర్భంగా ఈలేఖలో ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. 2007 అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యవహారాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు అప్పగించారని, పునర్వ్యవస్థీకరణ తర్వాత వరంగల్ వ్యవహారాలు మొత్తం నేనే పర్యవేక్షించానని చెప్పారు. వరంగల్ జిల్లా నుంచి ఎక్కువ మంది దళితులు, గిరిజనులకు అవకాశం దక్కాలని ఈ జిల్లాలో ఎక్కువ మంది పునర్విభజనలో ఆయా వర్గాలకే నేను సీట్లు కేటాయించాననన్నారు. అట్టడగుకు వర్గాలకే న్యాయం జరగాలన్నది నా సిద్ధాం అని నేను నా రాజకీయ పంథాను ప్రారంభించిందే నిమ్న వర్గాలకు న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలు నిమ్న వర్గాలకు కేటాయించడంలో నాడు నాదే కీలక పాత్ర అని వరంగల్ పార్లమెంట్ ను ఎస్సీ, మహబూబాబాద్ ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో చేసి దళిత, గిరిజనులకు ప్రత్యేక అవకాశం కల్పించేలా చేశానన్నారు.
నా భార్యపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు:
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా ఒక జిల్లాలో రెండు స్థానాలు రిజర్వు కావడం కేవలం వలంగల్ జిల్లాలో మాత్రమే సాధ్యం అయిందని అందుకోసం నేను తీవ్రంగా కృషి చేశాన్నారు. సామాజిక న్యాయం చేయాలన్న నా ప్రయత్నంలో భాగంగా ఈ ప్రక్రియలో తాను సీటును కోల్పోయానని ఇందుకు కొండా మురళియే కారణం అని చెబుతూ నాటి కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి రాజకీయాల్లోంచి బయటకు వెళ్లిపోయారన్నారన్నారు. అయితే నేడు ఆయన అల్లుడు అయిన మంత్రి పొంగులేటి స్రీనివాస్ రెడ్డి, వరంగల్ జిల్లా ఇన్ చార్జి మంత్రిగా ఉండి నా సతీమణి కొండా సురేఖ మీద కక్ష్య పూరితంగా వ్యవసరిస్తున్న్టలు కనిపిస్తోందని అదే కోపంతో ఆయన ఉన్నట్టు తాజా పరిణామాలు చూస్తుంటే నిశితంగా అర్థం అవుతున్నదని లేఖలో పేర్కొన్నారు.
ఆయన ఎవరి శిష్యుడో అందరికీ తీలుసు:
వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేదంర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను వెంట పెట్టుకుని మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయినా మేము వారికి ఎక్కడా ఇబ్బందులు చేయలేదు. ఇదే బస్వరాజు సారయ్య మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో నా సతీమణి కొండా సురేఖ మీద 2014లో 40 వేల ఓట్లతో ఓడిపోయారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రామసహాయం సురేందర్ రెడ్డికి ప్రధాన శిష్యుడు అనే విషయం అందరికి తెలిసిందేనన్నారు. ఇక ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మహబూబాబా్ద కు చెందిన నాయకులు. ఆయన గతంలో కొండా సురేఖ మీద పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో కొండా సురేఖకు ఘనమైన మెజార్టీ వచ్చింది. కానీ నరేందర్ రెడ్డికి కేవలం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు.
నన్నెవరూ పిలవలేదు:
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు నేను రాజీనామా చేసి వచ్చాను. అది నా నిబద్దత. కొంత మంది లీడర్ల మాదిరిగి పార్టీ మారినా పదవిలో కొనసాగలేదు. భారతదేశంలోనే ఏకగ్రీవంగా గెల్సిన ఏకైక ఎమ్మెల్సీని ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక నన్ను ఎవరు పిలిచి ఈ విషయాలు చెప్పమని అడగలేదు. మన పీసీసీ ప్రెసిడెంట్, బీసీ బిడ్డ మహేశ్ కుమార్ మీద అభిమానంతో నేనే వచ్చి పార్టీకి వివరించాలని అనుకున్నాను. అందుకే స్వయంగా వచ్చి ఈ విషయాలు తెలియజేస్తున్నాను అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా అక్కడి ఎమ్మెల్యేల పరిస్థితిని లేఖలో వివరించారు. ఈ సందర్భంగా గండ్ర, రేవూరి, నాయిని, వేం నరేందర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఉమ్మడి వరగల్ జిల్లా నేతలపై ఫిర్యాదు చేశారు. కొంత మంది మా మద్దతుతో గెలిచి ఇప్పుడు మాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు.






