- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమురవెల్లి మల్లన్న జాతర అప్‌డేట్
సిద్దిపేట(Siddipet) జిల్లా చేర్యాల(Cherial)లోని కొమురవెల్లి మల్లన్న జాతర(Komuravelli Mallanna Jathara) రేపటినుంచి(ఆదివారం) ప్రారంభం కానుంది.

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట(Siddipet) జిల్లా చేర్యాల(Cherial)లోని కొమురవెల్లి మల్లన్న జాతర(Komuravelli Mallanna Jathara) రేపటినుంచి(ఆదివారం) ప్రారంభం కానుంది. సంక్రాంతి(Sankranti) ముగియడంతో ప్రతీ ఆదివారం జాతర జరుగనుంది. రెండు నెలల పాటు నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఉగాది పండుగ ముందు వచ్చే ఆదివారం వరకు నిర్వహించనున్నారు. తొలి ఆదివారం మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆలయ పరిసరాల్లో విడిది చేసి దూళి దర్శనం చేసుకున్నారు.
జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలీసు అధికారులు(Police officers) భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా ఈ జాతరకు భక్తులు వస్తుంటారు. జాతరలో రెండో ఆదివారాన్ని లష్కర్‌వారంగా పిలుస్తారు. ఎక్కువగా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన భక్తులు తరలివస్తారు. మూడు రోజుల పాటు ఆలయం వద్ద సందడి చేస్తారు. డోలు, డప్పుల చప్పుళ్ల మధ్య పోతరాజుల విన్యాసాలు, పూనకాలతో శివసత్తుల నృత్యాలతో హోరెత్తుతుంది.






