అంగరంగ వైభవంగా కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం

by Gantepaka Srikanth |

సిద్దిపేట(Siddipet) జిల్లా చేర్యాల(Cherial)లోని కొమురవెల్లి మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

అంగరంగ వైభవంగా కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట(Siddipet) జిల్లా చేర్యాల(Cherial)లోని కొమురవెల్లి మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ప్రతీ ఆదివారం.. ఉగాది పండుగకు ముందు వచ్చే ఆదివారం వరకు జాతర కొనసాగనుంది. ఇవాళ తొలి ఆదివారం కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. పట్నాలు, బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలోఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా మల్లన్న జాతరకు భక్తులు తరలిరానున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం పెద్దపట్నం. ఈసారి ఫిబ్రవరి 2న అర్ధరాత్రి నిర్వహించనున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయం తరఫున నిర్వహించే ఈ కార్యక్రమం జాతరకే ప్రత్యేక ఆకర్షణ నిలవనుంది. స్వామి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి పట్నంపై ప్రతిష్ఠించి విశేష పూజలు చేస్తారు.

Next Story