- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలకు కోమటిరెడ్డి వార్నింగ్
by Sathputhe Rajesh |
కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిలపై వరుసగా మాటల దాడి చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిలపై వరుసగా మాటల దాడి చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గురువారం నల్లగొండలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఏక్ నాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ పార్టీ అన్నారు. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హితవు పలికారు. రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని.. కాంగ్రెస్‌లో ఏక్ నాథ్ షిండేలు, గ్రూపులు లేవన్నారు. అందరం రేవంత్ నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు. పనికిరాని చిట్ చాట్‌లు బంద్ చేయాలని మహేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. బండిసంజయ్‌ను ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
Next Story






