- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Komatireddy Venkatareddy : కేసీఆర్ తోనే మాట్లాడతా.. వేరే వాళ్ళతో పని లేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkatareddy) బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కేసీఆర్(KCR) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkatareddy) బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కేసీఆర్(KCR) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోడ్ల అభివృద్ది, పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడరు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ.. 'కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఆయన వస్తే ఆ పార్టీ నేతలు కోరుతున్నట్టు అన్ని అంశాలపై చర్చ జరుపుతాం' అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులైన హరీష్ రావు, కేటీఆర్‌లతో తమకు సంబంధం లేదని, వారు 'లెక్కలోకి కూడా రారు' అని వ్యాఖ్యానించారు.
కావాలంటే వారితో రేవంత్ రెడ్డి మాట్లాడతారు, నా రేంజ్ అది కాదు అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము కీలకంగా పనిచేశామని, తెలంగాణ రాష్ట్ర సాధనకు కాంగ్రెస్ పార్టీయే కృతజ్ఞతలకు అర్హమని పేర్కొన్నారు. హరీష్ రావును "ఉత్తి ఎమ్మెల్యే"గా అభివర్ణిస్తూ.. ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావాలని, ఆయన వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులు, ఒప్పులపై చర్చించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు రోడ్ల అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా చేస్తున్నామని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో భారత్ ప్రమచంలోనే ముందు ఉందని, అందులో తెలుగు రాష్ట్రాలు మరీ ముందున్నాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద నివారణకు బ్లాక్ స్పాట్స్ గుర్తించి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హ్యమ్ పద్దతిలో రోడ్ల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేస్తామని, 4 లైన్ల రోడ్లను 6 లైన్లుగా మార్చడం వల్ల ప్రక్రియ ఆలస్యం అవుతోందని కోమటిరెడ్డి పేర్కొన్నారు.






