- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ చట్టం తెస్తే రాజీనామా చేస్తా.. కోమటిరెడ్డికి తలసాని సవాల్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఏదో మాట్లాడితే ఆంధ్రా వాళ్లకు ఎవరికి ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వయు అని కోటమిరెడ్డి వెంకట్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఏదో మాట్లాడితే ఆంధ్రా వాళ్లకు ఎవరికి ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వయు అని కోటమిరెడ్డి వెంకట్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారని అన్నారు. ఒకవేళ కోమటిరెడ్డి ముఖ్యమంత్రిని ఒప్పించి చట్టం తెస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తలసాని సవాల్ చేశారు. కేసీఆర్ కల్యాణలక్ష్మికి లక్ష రూపాయలు ఇస్తే రేవంత్ రెడ్డి దానితోపాటు తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చాడన్నారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పారు.
ఫించన్లు పెంచుడతామని, ఆడబిడ్డలకు సైతం నెలకు రూ.2వేలు ఇస్తామని చెప్పాడన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్ అప్పులు చేశారని విమర్శిస్తున్నారని, అప్పులు చేసినా సెక్రటరేట్, కాళేశ్వరంతో పాటు చాలా ప్రాజెక్టులు కట్టారని వ్యాఖ్యానించారు. మరి రేవంత్ రెడ్డి అప్పులు చేసి ఏం కట్టాడని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం కాంట్రాక్టర్లను బెదిరించేందుకు హైడ్రాను తీసుకువచ్చిందని ఆరోపించారు. హైడ్రాను తీసుకువచ్చి పేదల ఇళ్లు కూలగొడుతున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.






