రాష్ట్ర విభజనపై కోమటిరెడ్డి రాజగోపాల్‌ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర విభజనపై కోమటిరెడ్డి రాజగోపాల్‌ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ‘నా వెనుక ఇంటెలిజెన్స్ ఉంది. నేను పార్టీ మారుతున్నానని.. జగన్‌ను కలుస్తున్నానని ప్రచారం చేశారు. రాజకీయ నాయకుడిగా కాదు.. ఒక సోదరుడిగా ఏపీకి వచ్చా. నేను వైఎస్సార్‌(YSR)కు చాలా పెద్ద అభిమానిని. ఒక మనిషి మరణిస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అది మామూలు విషయం కాదు. వైఎస్సార్‌ మరణంతోనే రాష్ట్ర విభజన జరిగింది’ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కూడా రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. పార్టీ మార్పు వార్తలను తీవ్రంగా ఖండించారు. కొందరు వ్యక్తులు తన ప్రతిష్ట దెబ్బతీసేందుకు.. సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

Next Story