‘ఆలస్యమైనా పర్వాలేదు.. నేను ఎదురుచూస్తా’: ఎమ్మెల్యే కోమటిరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్(Congress) సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఆలస్యమైనా పర్వాలేదు.. నేను ఎదురుచూస్తా’: ఎమ్మెల్యే కోమటిరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మునుగోడు ప్రజలను అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. అవసరం అయితే ప్రభుత్వంతో కూడా పోరాటం చేసేందుకు వెనుకాడను. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధం. ఆర్ఆర్ఆర్(RRR) భూ నిర్వాసితుల కోసం ప్రభుత్వంపై తప్పకుండా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తా. తిరిగి పార్టీలో చేరే సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చారు. ఆలస్యం అయినా పర్వాలేదు.. నేను ఎదురుచూస్తా. చివరకు న్యాయం జరుగుతుందనే అనుకుంటున్నాను’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కస్తూర్భా బాలికల పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విద్యార్థినుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు, డార్మెటరీ హాల్స్, బాత్రూంలు, టాయిలెట్లు, ప్లే గ్రౌండ్ లాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయా అని ఆరా తీశారు. పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు.

Next Story