- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీనామా వార్తలపై కోమటిరెడ్డి క్లారిటీ.. తెలంగాణ ప్రజలకు కీలక విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ పర్యటనపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పర్యటనపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్(YS Jagan)ను కలవడానికి వెళ్తున్నానని తనపై ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు. తాను జగన్‌ను కలవడానికి వెళ్లడం లేదు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తున్నానని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇదంతా నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర. దయచేసి తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మొద్దు. సోషల్ మీడియాలో నా మీద జరిగే అసత్య ప్రచారాలను నమ్మొద్దు’ అని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని సందర్భాల్లో తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పాను. అలా చెప్తే తప్పేంటి? అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.






