- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నో ప్రాబ్లమ్.. మునుగోడు నుంచే మొదలుపెట్టండి’: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) TGSPDCL రాష్ట్ర కార్యాలయంలో CMD ముషారఫ్(Musharraf)తో భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) TGSPDCL రాష్ట్ర కార్యాలయంలో CMD ముషారఫ్(Musharraf)తో భేటీ అయ్యారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న కరెంటు సమస్యలు, విద్యుత్ పనుల అభివృద్ధిపై ముఖ్య నాయకులతో కలిసి వెళ్లి మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విజ్ఞప్తులు చేశారు. నాణ్యమైన, భద్రతతో కూడిన కరెంటు ఇచ్చే విధంగా రాబోయే కాలంలో ప్రజా ప్రభుత్వం విద్యుత్ శాఖలో సమూలమైన సంస్కరణలు తీసుకొస్తుందని అన్నారు. ఆ సంస్కరణలు మొదట మునుగోడు నియోజకవర్గం నుండే మొదలుపెట్టాలని కోరారు. మునుగోడు నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని విద్యుత్ అభివృద్ధి పనులు చేయాలని సీఎండీ ముషారఫ్‌ను కోరారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న కరెంటు సమస్యలు పరిష్కరించడానికి రూ.34 కోట్లు అవసరమవుతున్నాయని, ప్రత్యేక దృష్టితో రూ.34 కోట్ల రూపాయల పనులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా సీఎండీ ముషారఫ్‌కు వినతి పత్రం అందజేశారు.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న కరెంటు సమస్యలు, విద్యుత్ పనుల అభివృద్ధి పై మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులతో కలిసి హైదరాబాదులోని TGSPDCL రాష్ట్ర కార్యాలయంలో CMD ముషారఫ్ గారితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) May 13, 2025
నాణ్యమైన, భద్రతతో కూడిన కరెంటు… pic.twitter.com/vmaF5aYTPb





