కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గొప్ప మనసు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) గొప్ప మనసు చాటుకున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గొప్ప మనసు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ(Congress Party) సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) గొప్ప మనసు చాటుకున్నారు. పేదింటి బిడ్డకు పునర్జన్మను ప్రసాదించారు. రూ.12 లక్షల సొంత డబ్బుతో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించారు. వివరాల్లోకి వెళితే.. మునుగోడు నియోజకవర్గం కొండూరు గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు నెల్లి గణేష్(26) గత కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. కిడ్నీలు దెబ్బతిన్నాయని కిడ్నీ మారిస్తే కానీ బతకడని డాక్టర్లు చెప్పారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో ఏం చేయలేక రోజూ ఏడుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక నేతలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కిడ్నీ మార్పిడి చికిత్స చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. రూ.12.50 లక్షల సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించారు. గణేష్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ట్వీట్

Next Story