- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తున్నారు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
by Muthe.Rajitha |
తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను అనని వ్యాఖ్యలు కూడా అంటగట్టి ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను ఏదైనా రాజకీయ పరంగా నిర్ణయం తీసుకుంటే ప్రెస్మీట్ పెట్టి నేనే చెప్తానని స్పష్టం చేసారు. మంత్రివర్గ విస్తరణ అనేది హైకమాండ్ తీసుకునే నిర్ణయమని, పార్టీకి ఏది మంచిదో ఆ నిర్ణయమే అధిష్టానం తీసుకుంటుందని పేర్కొన్నారు. దీనిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో తనమీద ట్రోలింగ్ కు దిగారని ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా మునుగోడు అభివృద్ధి కోసం కృషి చేస్తానని, మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో అన్నారు.
Next Story





