- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు రుణమాఫీ CM కేసీఆర్ మరో ఎన్నికల స్టంట్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నాలుగున్నరేళ్లుగా మరిచిపోయిన రుణమాఫీ హామీ కేసీఆర్‌కు ఇప్పుడు హఠాత్తుగా గుర్తుకు వచ్చిందని ధ్వజమెత్తారు. రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ తర్వాత ఆ మాటను మర్చిపోయారని.. తీర ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ అదే మాట ఎత్తుకున్నారని ధ్వజమెత్తారు.
25,000 వేల రూపాయల కోట్లు అవసరం అయ్యే రైతు రుణమాఫీ పథకానికి.. కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. ఇది కేవలం రైతులను మరోసారి మోసం చేయడమేనని మండిపడ్డారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన రైతు రుణమాఫీ విషయంలో కేసీఆర్ మరో ఎన్నికల స్టంట్ అని విమర్శించారు.
Next Story






