కేసీఆర్.. దమ్ముంటే మునుగోడులో పోటీ చేయ్: సీఎంకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్

by Disha Web Desk 19 |
కేసీఆర్.. దమ్ముంటే మునుగోడులో పోటీ చేయ్: సీఎంకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడులో తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. లేదా నేనే గజ్వేల్‌లో పోటీ చేసి నిన్ను ఓడిస్తానని అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో 100 మంది ఎమ్మెల్యీలను తీసుకొచ్చి దుర్మార్గంగా నన్ను ఓడించావని ఫైర్ అయ్యారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నన్ను మునుగోడులో ఓడించావని నిప్పులు చెరిగారు. అధికార బీఆర్ఎస్‌ పార్టీని గద్దె దించడమే నా లక్ష్యమని.. అందుకే మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కమలానికి గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. తిరిగి తన సొంతగూటికి చేరుకున్నారు.



Next Story

Most Viewed