DK శివకుమార్ తో కోమటిరెడ్డి భేటీ

by Muthe.Rajitha |   (  Updated:2025-08-06 11:52:13  IST  )

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Deputy CM DK Shivakumar) తో కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) భేటీ అయ్యారు.

DK శివకుమార్ తో కోమటిరెడ్డి భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Deputy CM DK Shivakumar) తో కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక, తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల గురించి ఇరువురు చర్చించినట్టు సమాచారం. అయితే తనకు మంత్రి పదవి ఇస్తానని గతంలో హామీ ఇచ్చిందని డీకే శివకుమార్ కు తెలిపిన కోమటిరెడ్డి... ఆ విషయాన్ని హైకమాండ్ కు గుర్తు చేసే బాధ్యత డీకే తలకు ఎత్తినట్టు సమాచారం.

కాగా తనకు మంత్రి పదవి రాకపోవడంపై తీవ్ర అసహనంతో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్.. తరచూ సీఎం రేవంత్ రెడ్డిపై మాటలతో విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే. తన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి కూడా పదవులు ఇస్తున్నారని హైకమాండ్ ను విమర్శిస్తూ.. అవసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించారు.

సమయం వచ్చినప్పుడు వారి బండారం బయట పెడతా .. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎంగా రేవంత్ ఇంకా మూడున్నరేళ్లే.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

Next Story