సీఎంగా రేవంత్ ఇంకా మూడున్నరేళ్లే.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-06 07:49:36  IST  )

ఇటీవల సభలు, సమావేశాలు, సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.

సీఎంగా రేవంత్ ఇంకా మూడున్నరేళ్లే.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సభలు, సమావేశాలు, సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదారాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన భాషను మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి.. ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల పేరుతో 20 మంది సీమాంధ్రకు చెందిన కాంట్రాక్టర్లు ప్రభుత్వ సంపదను అప్పనంగా దోచేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితో తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ ప్రామిస్ చేసిందని గుర్తు చేశారు. ఇంకా మూడున్నరేళ్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని.. ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామని అన్నారు.

అందరం కలిసి పనిచేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడ మల్లన్న అన్నట్లుగా సీఎం తీరు ఉందని అన్నారు. నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పింది ఏఐసీసీ అని.. ఇందులో నా అన్న కోమటి‌రెడ్డి వెంకట్‌ రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రధాన పత్రిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ రావడం లేదని.. ఇకనైన ఆయన తన పదవికి రాజీనామా చేస్తే బెటర్ అని కామెంట్ చేశారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్‌లో బీఆర్ఎస్ వాళ్లు ఉన్నారని.. అందుకే కాళేశ్వరం విషయంలో తమ ప్రభత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇంకా కమిషన్లు వేసి కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకవేళ తానే బీఆర్ఎస్ పార్టీలోకి వెళితే.. కేసీఆర్ ఏనాడో మంత్రి పదవి ఇచ్చేవారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Next Story