- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోమటిరెడ్డిపై కైలాష్ నేత మాటలను సమర్థించను: మహేష్ కుమార్ గౌడ్
కోమటిరెడ్డిపై కైలాష్ నేత మాటలను సమర్థించను: మహేష్ కుమార్ గౌడ్

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్(BRS) మరో కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. ‘దీక్ష దివాస్’ పేరిట ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధమైందని అన్నారు. కేసీఆర్ బయటికి వస్తే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రెండేళ్ల ప్రజాపాలన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ముగిసిన శకం అని కేసీఆర్ స్వయంగా అర్థం చేసుకున్నారు.. అందుకే మౌనంగా ఉన్నారని అన్నారు. ప్రజా సెంటిమెంట్‌ను రాజకీయ లాభం కోసం వాడుకుని కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందని వెల్లడించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మహేశ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ బూటకపు మాటలను నమ్మొద్దని సూచించారు. అమరుల శవాలపై కేసీఆర్ అధికారం అనుభవించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకం.. కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ రాలేదు.. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. 'రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నా' అని చెప్పి నిమ్స్‌లో కేసీఆర్ ఫ్లూయిడ్స్ తీసుకున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, కేటీఆర్ ఒక్కసారి చదవాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించాలని సూచించారు. పార్లమెంట్, జూబ్లీహిల్స్, ఉపఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ వచ్చిందంటే అది సోనియా గాంధీ చలవ వల్లే. సోనియా గాంధీ లేకపోతే రాష్ట్రం వచ్చేదే కాదని కేసీఆర్ స్వయంగా చెప్పారు. విద్యార్థుల ఆత్మబలిదానాలకు స్పందించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్లగొండ డీసీపీ కైలాష్ నేత మాట్లాడిన వీడియో ఇప్పటిది కాదు.. మూడేళ్ల క్రితం నాటి వీడియో.. నేను కూడా కైలాష్ నేత మాటలను సమర్థించను.. ఈ విషయంపై కైలాష్ నేత ఇప్పటికే బహిరంగ క్షమాపణ చెప్పారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం.. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రజా ప్రతినిధులను నిలదీయండని మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.






