నాకు పదవులు ముఖ్యం కాదు.. Komati Reddy Venkat Reddy సంచలన వ్యాఖ్యలు

by samatah |   (  Updated:2022-12-11 08:50:52  IST  )

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం టీపీసీసీ నూతన కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది.

Congress MP Komati Reddy Venkat Reddy Comments On TPCC Chief Revanth Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏఐసీసీ ప్రకటించిన టీపీసీసీ నూతన కమిటీలపై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కమిటీల్లో తనకు చోటు లభించకపోవడంపై వెంకట్ రెడ్డి స్పందిస్తూ..'నాకు పదవులు ముఖ్యం కాదు. పేదలు, కార్యకర్తలే ముఖ్యం'అని అన్నారు. ఆదివారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవికే రాజీనామా చేసిన విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. ఢిల్లీలో చాలా హైపవర్ కమిటీలున్నాయని వ్యాఖ్యానించారు. తాను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడబోనన్నారు. ఎన్నికలకు నెల రోజుల మందు మాత్రమే రాజకీయాలు మాట్లాడుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుండే పోటీ చేస్తా అంటూ శపథం చేశారు. ఎవరికి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, కమిటీ ప్రకటనలో కోమటి రెడ్డి పేరు లేకపోవడంతో చర్చకు దారితీస్తున్న సమయంలో నల్లగొండ జిల్లా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం సంచలనంగా మారింది.

Next Story