- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియాంక గాంధీ సభకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యువ సంఘర్షణ సభకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరయ్యారు. యువతే టార్గెట్‌గా కాంగ్రెస్ చేపట్టిన ఈ సభకు స్వయంగా ప్రియాంక గాంధీ హాజరుకావడంతో దాదాపు రాష్ట్రంలోని టీ- కాంగ్రెస్ నేతలు అంతా ఈ సభకు హాజరయ్యారు.
అలాంటి ఈ సభకు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత అయిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గైర్హాజర్ కావడం విశేషం. అయితే, విదేశీ టూర్‌లో ఉండటంతోనే కోమటిరెడ్డి ఈ సభకు హాజరుకాలేదని సమాచారం. ప్రియాంక గాంధీ ఆఫీస్‌కు ఈ సమాచారం పంపించామని కోమటిరెడ్డి సిబ్బంది పేర్కొంటున్నారు. అయినప్పటికీ కోమటిరెడ్డి తీరుపై మరోసారి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ సరూర్ నగర్ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ సమావేశానికి ప్రియాంక గాంధీ హాజరవుతారని షెడ్యూల్ ముందే ఫిక్స్ అయినప్పటికీ కోమటిరెడ్డి మాత్రం విదేశీ టూర్‌కు వెళ్లడంపై కొందరు పెదవి విరుస్తున్నారు.






