- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Komati Reddy: కాళేశ్వరం కథ త్వరలోనే అందరికీ తెలుస్తది.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో రూ.కోట్ల ప్రభుత్వం ధనాన్ని దోచుకుని ప్రజలను నిలువునా మోసం చేసిందని, త్వరలోనే కాళేశ్వరం (Kaleshwaram) కథ అందరికీ తెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkatreddy) కామెంట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో రూ.కోట్ల ప్రభుత్వం ధనాన్ని దోచుకుని ప్రజలను నిలువునా మోసం చేసిందని, త్వరలోనే కాళేశ్వరం (Kaleshwaram) కథ అందరికీ తెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkatreddy) కామెంట్ చేశారు. ఇవాళ భారత్ సమ్మిట్ (Bharat Summit)లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి వచ్చిన NDSA రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleswaram Project) ఓ నాసిరకమైన ప్రాజెక్ట్ అని తెలిపారు. తెలివి ఉన్న వాడు ఎవడూ ఆ ప్రాజెక్ట్‌ను నిర్మించి ఉండేవారు కాదని అన్నారు.
NDSA రిపోర్టులోని అంశాలను తాము ఇంకా బయట పెట్టలేదని.. బీఆర్ఎస్ (BRS) వాళ్లే బయటకు పెట్టుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు. ఒక వేళ తమ్మిడిహట్టి ప్రాజెక్ట్ (Tammidihatti Project)ను పూర్తి చేస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి పేరు వస్తుందోనని.. పదేళ్ల పాటు ఆ ప్రాజెక్ట్‌ను పట్టించుకోకుండా పడావు పెట్టారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barage) కుంగిపోవడం చిన్న విషయం అన్నట్లుగా బీఆర్ఎస్ (BRS) నేతలు మాట్లాడటం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. మేడిగడ్డతో సుందిళ్ల ప్రాజెక్ట్ (Sundilla Project)లు ఎందుకూ పనికి రావంటూ NDSA నివేదిక ఇచ్చిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.






