Komati Reddy Vs Revanth Reddy: ఓసారి మీ అన్న మాటలు విను.. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-07-19 12:27:22  IST  )

రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి.

Komati Reddy Vs Revanth Reddy: ఓసారి మీ అన్న మాటలు విను.. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల  కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి కోమటిరెడ్డి బ్రదర్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చర్చనీయాశంగా మారింది. పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) స్పందన రచ్చగా మారింది. మంత్రి పదవిని ఆశించిన రాజగోపాల్ రెడ్డి గత కొంత కాలంగా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న వేళ అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటూ రాజగోపాల్ రెడ్డి రేపిన స్పార్క్ ఇప్పుడు ఆ పార్టీలో చిలికి చిలికి దుమారంగా మారోబోతున్నదా అనే చర్చ జరుగుతోంది. ఈక్రమంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు ఇస్తున్న రియాక్షన్స్ స్టేట్ పాలిటిక్స్ లో హాట్ హాట్ గా మారాయి.

నువ్వా మాకు చెప్పేది:

రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలతోనే కాంగ్రెస్ శ్రేణలుు కౌంటర్ ఇస్తున్నాయి. గతంలో వెంకట్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ ఐదేళ్లే కాదు మరో ఐదేళ్లు కూడా సీఎంగా ఉంటారని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్స్ ను కాంగ్రెస్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'ఒక్కసారి మీ అన్న మాటలు విను. పార్టీ మారిన నువ్వే చెప్పాలి మాకు సూక్తులు. ఈ వేషాలు వేస్తున్నందుకే నీకు మంత్రి పదవి దక్కలేదు' అని కౌంటర్లు ఇస్తున్నారు. ' పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బీజేపీకి అమ్ముడు పోయి ఇప్పుడు హోం మంత్రి అవుతానని చెప్పుకోవడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం కాదా? ఏదైనా ఉంటే అతంర్గతంగా మాట్లాడుకోవాలి,. ఇలా బహిరంగంగా పెట్టడం పార్టీ విధానమా?' అని నిలదీస్తున్నారు. మరో వైపు రాజగోపాల్ రెడ్డి అభిమానులు సైతం అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి తెలియక విమర్శిస్తున్నారని ఈరోజు తెలంగాణలో నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్త ఎంత మానసిక క్షోభకు గురి అయితున్నాడో అనుభవించేవాడికి తెలుసు. ఏదో ఒక రోజు మొత్తం బయట పడుతుంది అంటూ కౌంటర్లు ఇస్తురు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా ట్వీస్ట్ రచ్చ తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి మలుపులకు కేరాఫ్ అడ్రస్ గా మారబోతున్నది అనేది చూడాలి.

Next Story