కరీంనగర్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొలగాని శ్రీనివాస్.. అభివృద్ధి పనుల ఫైలుపై తొలి సంతకం

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-22 08:07:28  IST  )

కరీంనగర్ నూతన మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. తాగునీటి సమస్య, విలీన గ్రామాల అభివృద్ధిపై ఆయన తొలి సంతకాలు చేశారు.

కరీంనగర్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొలగాని శ్రీనివాస్.. అభివృద్ధి పనుల ఫైలుపై తొలి సంతకం
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ నగర మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) ఇవాళ మధ్యాహ్నం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే మేయర్ శ్రీనివాస్ నగర అభివృద్ధిపై తనదైన ముద్ర వేస్తూ.. నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా, నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త అభివృద్ధి పనుల మంజూరుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.

అయితే, మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన కొలగాని శ్రీనివాస్‌కు కార్పొరేషన్ అధికారులు, వివిధ విభాగాల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో కొలిగాని శ్రీనివాస్ అన్నారు.

Next Story