రూ.150 కోట్లు దాటిన ఎకరం.. రికార్డు ధర దిశగా కోకాపేట్ భూముల వేలం

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-28 13:12:01  IST  )

రూ.150 కోట్లు దాటిన ఎకరం.. రికార్డు ధర దిశగా కోకాపేట్ భూముల వేలం

రూ.150 కోట్లు దాటిన ఎకరం.. రికార్డు ధర దిశగా కోకాపేట్ భూముల వేలం
X

దిశ, వెబ్‌డెస్క్: కోకాపేట నియోపోలిస్ భూముల వేలంలో నయా రికార్డు నమోదైంది. శుక్రవారం మరో రెండు ప్లాట్లకు హెచ్‌ఎండీఏ ఈ వేలం నిర్వహించింది. 15, 16 నెంబర్ ప్లాట్లకు ఈ-వేలం జరుగుతోంది. ఇప్పటికే 15వ ప్లాట్ ఎకరం రూ.151.25 కోట్లు పలికింది. ప్రస్తుతం 16వ ప్లాట్ వేలం జరుగుతోంది. దీనికి కూడా రికార్డు ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతవారం 17, 18వ ప్లాట్లకు వేలం వేయగా.. ఎకరాకు రూ.137.25 కోట్ల ధర పలికింది. దానికి మించి ఈ వారం ప్లాట్లకు సైతం ఇదే తరహాలో ధరలు పలికే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ మధ్య కాలంలో రాయదుర్గంలో టీజీఐఐసీ భూముల్లో ఎకరాకు రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. ఎకరాకు ప్రారంభ ధర రూ.99 కోట్లుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే 2023లో జరిగిన నియోపొలిస్ ఆక్షన్లలో సగటు ధర ఎకరాకు సుమారు రూ.73 కోట్లు మాత్రమే పలికింది. ప్రస్తుత ఫలితాలు భూ విలువల్లో 87శాతం పెరుగుదలతో ఎకరాకు రూ.150 కోట్లకు పైగా పలకడం విశేషం. ఈ ధరలు నియో పొలిస్ లేఅవుట్ పై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసాన్ని చూపిస్తున్నాయి. ఈ రెండు ప్లాట్ల వేలంతో ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం వస్తోంది.

Next Story