- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తెలంగాణ అంటేనే స్వయం అస్థిత్వం’.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ అంటేనే స్వయం అస్థిత్వమని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అంటేనే స్వయం అస్థిత్వమని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కోదండరాం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజాస్వామికంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వం దగ్గరగా ఉండాలనే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ మాదిరిగా కాకుండా.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో చర్చకు ఆస్కారం ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ విద్య, వైద్య రంగాలపై ఇంకా బాగా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా కోదండరాం సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇన్నాళ్లు రోడ్లమీద పడి కొట్లాడటానికే సరిపోయిందని అన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ కోరిన మాట వాస్తవమేనని చెప్పారు. తెలంగాణకు ఏం మంచి జరుగుతుందనేదే మాకు ముఖ్యమని, రాష్ట్ర ప్రజలకు మంచి జరగడమే నాకు నిజమైన సంతృప్తి అని అన్నారు. ఢిల్లీలో కన్నా ఇక్కడ ఉంటేనే ప్రజలకు ఏమైనా చేయగలనని చెప్పారు.






