- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వృద్ధి సామర్థ్యాలు.. కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల చారిత్రాత్మక రీసెర్చ్ గ్రంథం విడుదల
తెలంగాణ వృద్ధి సామర్థ్యాలపై కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల చారిత్రాత్మక రీసెర్చ్ గ్రంథం తాజాగా విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ వృద్ధి సామర్థ్యాలపై (KNM Government Degree College) కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల చారిత్రాత్మక రీసెర్చ్ గ్రంథం తాజాగా విడుదల చేసింది. మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన తొలి పరిశోధన గ్రంథం ‘గ్రోత్ పొటెన్షియాలిటీస్ ఇన్ తెలంగాణ: ప్రాస్పెక్ట్స్ అండ్ ఛాలెంజెస్’ను ఇవాళ (శనివారం) హైదరాబాద్‌లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం డాక్టర్ గుమ్మడి నరేశ్ కృషిని ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం అభినందించారు.
మార్చి 17, 18 తేదీల్లో నిర్వహించిన జాతీయ సదస్సులో అందిన 110 పరిశోధన పత్రాల్లో ఎంపికైన 40 వ్యాసాలతో ఈ గ్రంథం వెలువడింది. ఈ గ్రంథానికి ఎడిటర్లుగా ప్రొఫెసర్ ఎస్.ఇంద్రకాంత్ (సీఈఎస్ఎస్, హైదరాబాద్), డాక్టర్ గుమ్మడి నరేశ్ (అర్థశాస్త్ర విభాగాధిపతి, కేఎన్ఎం కళాశాల) వ్యవహరించారు. దేశవ్యాప్తంగా ఉన్న అర్థ శాస్త్ర నిపుణులు స్కాలర్స్, అధ్యాపకులు తెలంగాణ ఆర్థిక స్థితిగతుల పైన ముఖ్యంగా తెలంగాణలోని వ్యవసాయ రంగం, నీటిపారుదల సౌకర్యాలు,సేవల రంగం అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి, ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన అంశాల పైన పరిశోధన వ్యాసాలు రావడం జరిగింది.
వీటన్నింటినీ క్రోడీకరించి, ఈ పరిశోధనా గ్రంధాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భీమార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. పుస్తకాన్ని ప్రచురించడం సాధారణ విషయమేమీ కాదని, ఇది పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. పుస్తకావిష్కరణ ఎడిటర్ గా ఉన్న ప్రొఫెసర్ ఇంద్రకాంత్ మాట్లాడుతూ.. గ్రామీణ కళాశాల నుంచే రీసెర్చ్ గ్రంథం వెలువడటం గర్వకారణమని తెలిపారు.






