- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
K.Keshava Rao: లాభం వస్తే కవిత చేరికపై అభ్యంతరాలు ఎందుకు?. కేకే సెన్సేషనల్ కామెంట్స్
కాంగ్రెస్ లో కవిత చేరిక అంశంపై కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) కాంగ్రెస్ లో చేరికపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు (K.Keshava Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె చేరికతో కాంగ్రెస్ పార్టీకి నిజంగానే లాభం చేకూరుతుందని అని అనుకుంటే ఆమె చేరికపై మనకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదన్నారు. కానీ కవితతో పెద్దగా పార్టీకి లాభం కలిసి వస్తుందని నేను అనుకోవడం లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కవిత మాటలను కాంగ్రెస్ లో ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించడం లేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని కాంగ్రెస్ లోనే చస్తానన్నారు. తెలంగాణ ఇవ్వనందునే నేను గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చిందని చెప్పారు.
ఆపరేషన్ కగారుపై స్పందిస్తూ శాంతి చర్చలకు వస్తామని ఓ వైపు నుంచి ప్రతిపాదన వస్తే దాన్ని ఎందుకు స్వాగతించకూడదన్నారు. మావోస్టులకు వ్యతిరేకంగా జరిగే ఆపరేషన్స్ గురించి పార్లమెంట్లోనే మాట్లాడిన వ్యక్తిని నేను అన్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. భారత్ -పాక్ మధ్య 6 యుద్ధాలు జరిగాయి. మిలిటరీ చేసే పనులకు పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ ఎందుకు అని ప్రశ్నించారు. యుద్ధంలో గెలుస్తామని పాక్ కు బుద్ధి చెప్పబోతున్నామన్న తరుణంలో యుద్ధం ఎవరో ట్రంప్ మాటలతో కాల్పుల విరమణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.






