BC Reservations: చేతులు జోడించి వేడుకుంటున్న.. బీసీ రిజర్వేషన్లపై కేకే హాట్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-07-11 09:49:28  IST  )

బీసీ రిజర్వేషన్లపై కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు.

BC Reservations: చేతులు జోడించి వేడుకుంటున్న.. బీసీ రిజర్వేషన్లపై కేకే హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీల రిజర్వేషన్ల (BC Reservations) విషయంలో రాజకీయం వద్దు అని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు (K.Keshava Rao) ప్రతిపక్షాలను కోరారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించుకుని రిజర్వేనష్లు ఇచ్చుకోబోతున్నామని చెప్పారు. తెలంగాణలో స్థానిక సంస్థలకు 42 శాతం రిజర్వేషన్లకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘బీఆర్ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మంత్రులుగా పని చేసిన వారు చివరకు మధుసూధనాచారి వంటి వారు కూడా మాట్లాడుతున్నారు. చేతులు జోడించి వేడుకుంటున్నాను రిజర్వేషన్ల అమలును అడ్డుకోవద్దు’ అన్నారు. సాంకేతిక, న్యాయపరమైన అంశాలు తెలియకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

బీసీలు రాజకీయాల్లో రిజర్వేషన్ల కోసం ఎన్నో దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. బీసీల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న వారిలో చాలా మంది కాంగ్రెస్ నేతలు ఉన్నారని కేకే చెప్పారు. బీసీ ఉద్యమానికి అండగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారు ఉన్నారని చెప్పారు. బీసీలు ఇతర కులాలకు వ్యతిరేకం కాదన్నారు. దశాబ్దాల బీసీల కల సాకారం అవుతున్న తరుణంలో ఎవరూ రాజకీయం చేయకుండా సహకరించాలని అన్ని పార్టీలను కోరారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Next Story