Kite festival: ఇకపై గ్రామాల్లోనూ పతంగుల పండగ!

by Prasad Jukanti |

ఇకపై గ్రామాల్లోనూ పతంగుల పండగ!

Kite festival: ఇకపై గ్రామాల్లోనూ పతంగుల పండగ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో మూడు రోజుల పాటు రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో గ్రామాల్లోనూ పతంగుల ఫెస్టివల్స్ (Kite Festival) నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం (Telangana Government) ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పండగ పూట ప్రజలు సొంత గ్రామాలకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ కైట్స్ ఫెస్టివల్స్ ను గ్రామాలకు (Kite Festivals in Telangana Villages) విస్తరించడం ద్వారా మరింత గ్రాండ్ గా సెలబ్రెషన్స్ ను చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలను గ్రామాల్లో పెద్ద ఎత్తున చేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే.

Next Story