హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్.. డేట్స్ ఫిక్స్

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్.. డేట్స్ ఫిక్స్

హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్.. డేట్స్ ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో జనవరి నెలలో హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున పండుగలను నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జనవరి 13 నుంచి 15 వరకు అంతర్జాతీయ పతంగుల, స్వీట్ ఫెస్టివల్‌ను, ఆ తర్వాత జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ ప్రకటించింది. వీటితో పాటు జనవరి 13,14 తేదీల్లో ప్రత్యేకంగా డ్రోన్ ఫెస్టివల్‌ను కూడా చేపట్టనున్నారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన గురువారం బేగంపేటలోని 'ది ప్లాజా' హోటల్‌లో అంతర్ శాఖల సమన్వయ సమావేశం జరిగింది.

పండుగలను విజయవంతంగా, సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రచారం చేయడంతో పాటు, స్వదేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను రూపొందించారు. డ్రోన్ డే సందర్భంగా నిర్వహించే డ్రోన్ ఫెస్టివల్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సమావేశంలో టీజీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్ ఏటీజీ ఎండీ సోనీ బాలా, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక, నార్త్ జోన్ డీసీపీ ఎస్ రష్మీ పెరుమాళ్, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమన్వయ సమావేశంలో పాల్గొని, ఈ మెగా ఈవెంట్లకు కావాల్సిన ఏర్పాట్లపై తమ సూచనలను అందించారు.

Next Story