- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kite Festival: నేటి నుంచి కైట్ ఫెస్టివల్ షురూ.. ప్రారంభించనునున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్రాంతి (Sankranti) పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ (Secunderabad) పరేడ్ గ్రౌండ్ (Parade Ground) వేదికగా.. రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ (International Kite and Sweet Festival) ప్రారంభం కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranti) పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ (Secunderabad) పరేడ్ గ్రౌండ్ (Parade Ground) వేదికగా.. రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ (International Kite and Sweet Festival) ప్రారంభం కాబోతోంది. కైట్స్ ఫెస్టివల్‌ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. మొత్తం 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ ఫెస్టివల్‌లో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్‌లో 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. నోరూరించే సాంప్రదాయ పిండి వంటలతో స్వీట్ ఫెస్టివల్ కొనసాగనుంది. మొత్తం 1,100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్లు, పిండి వంటలను అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇరాన్ (Iran), తుర్కియే (Turkey), అప్ఘనిస్తాన్ (Afghanistan)తో పాటు మరో తొమ్మిది దేశాలకు చెందిన 700 మంది హోమ్ మేకర్స్ ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు. కైట్ ఫెస్టివల్ (Kite Festival)కు సుమారు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది.






