- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల స్టేషన్లలో వందే భారత్ హాల్టింగ్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తెలంగాణలోని సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల స్టేషన్లలో హాల్టింగ్ ఏర్పాటు చేస్తూ రైల్వేశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తెలంగాణలోని సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల స్టేషన్లలో హాల్టింగ్ ఏర్పాటు చేస్తూ రైల్వేశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ రైలుకు ఈ రెండు స్టేషన్లలో స్టాప్ లేకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లగా, అందుకు సానుకూలంగా స్పందించిన రైల్వేశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రజల విజ్ఞప్తి మేరకు రైల్వే అధికారులు హాల్టింగ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రజల తరపున ప్రధానికి, రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతాల ప్రయాణికులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.






