- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంత మాత్రాన తప్పించుకుంటారనుకుంటే పొరపాటే.. రేవంత్ సర్కా్ర్‌కు కిషన్ రెడ్డి హెచ్చరిక
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉపాధ్యాయులతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, కేంద్రంపై విషం కక్కినంత మాత్రాన వైఫల్యాల నుంచి తప్పించుకుంటామనుకుంటే.. పొరబడినట్లే అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని.. అడుగడుగునా నిలదీస్తామని హెచ్చరించారు.
ఇచ్చిన హామీలన్నింటికనీ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ.2500 సాయం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచిన పింఛన్లు, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు(Ration Cards), ఫీజు రియింబర్స్‌మెంట్స్, రుణమాఫీ ఇలా చెప్పుకుంటూ ఏదీ సక్రమంగా అమలు చేయడం లేదని.. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని చెప్పారు.
గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను భర్తీ చేసి.. వారే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కాంగ్రెస్ నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తప్పకుండా బీజేపీ జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వారానికోసారి ఢిల్లీ(Delhi Tour) వెళ్లడం లేదని.. సీటు కాపాడుకోవానికి ఢిల్లీ వెళ్లి అటెండెన్స్ వేయించుకున్నాడని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) చెప్పినట్లు విని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనతో విసిగిపోయిన ప్రజలు.. కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ బాటలోనే వెళ్తోందని మండిపడ్డారు.






