Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కిషన్ రెడ్డి సీరియస్

by Gantepaka Srikanth |

తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్‌(BRS)లు వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మండిపడ్డారు.

Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కిషన్ రెడ్డి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్‌(BRS)లు వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ అసమర్థత నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు తాము డిమాండ్ చేశామని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి కోరానని చెప్పుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

Next Story