తుమ్మల నాగేశ్వర రావుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తుమ్మల నాగేశ్వర రావుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కిషన్ రెడ్డి(Kishan Reddy) మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వర రావు ఆల్ పార్టీ మంత్రి అని అన్నారు. టీడీపీ హయాంలో, బీఆర్ఎస్‌ హయాంలో, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ మంత్రిగా పనిచేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాలని అన్నారు. తప్పు చేయలేదు కాబట్టే ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) ఎదుట విచారణకు హాజరు అయ్యారని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ విచారణకు హాజరై చూపించాలని సవాల్ చేశారు. కేవలం మాజీ ఆర్థికమంత్రిగానే ఈటల విచారణకు వెళ్లారని తెలిపారు. విచారణలో బీజేపీ స్టాండ్ ఏంటని కమిషన్ అడగలేదు. అడగదు కూడా అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో ఈటల వివరించినట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అతి త్వరలో ఉంటుందని అన్నారు. సేవ్ తెలంగాణ నినాదంతో తాము ముందుకు వెళ్లబోతున్నట్లు చెప్పారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోవడమే తమ లక్ష్యమన్నారు.

Next Story