రేవంత్‌ సర్కార్‌కు కిషన్ రెడ్డి సంచలన సవాల్.. చర్చకు సిద్ధమని ప్రకటన

by Gantepaka Srikanth |

తెలంగాణ సర్కార్‌(Telangana Govt)కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సవాల్ చేశారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రేవంత్‌ సర్కార్‌కు కిషన్ రెడ్డి సంచలన సవాల్.. చర్చకు సిద్ధమని ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్‌(Telangana Govt)కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సవాల్ చేశారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే మాత్రమే చేసింది.. ఏ సర్క్యూలర్ చూసినా సర్వే అని మాత్రమే ఉంటుందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేశామని గొప్పగా చెప్పుకుంటున్న ఆ సర్వే కూడా తూ తూ మంత్రంగానే చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నిర్వహించిన సర్వేపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎక్కడి రమ్మంటే.. అక్కడకు వస్తా.. అని సవాల్ చేశారు. రాష్ట్రంలో ఉన్నది చేతల ప్రభుత్వం కాదని.. మాటల ప్రభుత్వమని విమర్శించారు. కేసీఆర్‌(KCR)ను గద్దె దింపిన రాష్ట్ర ప్రజలు.. మరో నియంతను గద్దెనెక్కించారని అన్నారు. అందుకే ప్రజలంతా బీజేపీ(BJP)వైపు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అనేక హామీలను విస్మరించి ప్రజలను నిండా ముంచిందని అన్నారు.

కాగా, దేశంలో కులగణనకు (Caste Census) సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కులగణన పేరుతో కాంగ్రెస్‌ సర్వే(Congress Survey) చేయించిందని, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేల్లో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే.. కేంద్రం కులగణన నిర్ణయానికి కిషన్ రెడ్డి హర్షిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన సర్వేపై తీవ్ర విమర్శలు చేశారు.

Next Story