కేసీఆర్-కవిత మధ్య లేఖ ఓ డ్రామా.. అందులో ఏమీ లేదు: కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-23 11:22:38  IST  )

బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) లేఖపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు.

కేసీఆర్-కవిత మధ్య లేఖ ఓ డ్రామా.. అందులో ఏమీ లేదు: కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) లేఖపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ - కవిత మధ్య లేఖ అనేది ఓ డ్రామా అని కొట్టిపారేశారు. అసలు అందులో ఏమీ లేదని సెటైర్ వేశారు. ఇలాంటి కుటుంబ పార్టీలతో రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా ప్రమాదమని అన్నారు. బీఆర్ఎస్ అంటే.. డాడీ, డాటర్, సన్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీని, ఆ నాయకులను తెలంగాణ సమాజం ఎప్పుడో తిరస్కరించిందని తెలిపారు. మునిగిపోయిన పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా దండగ అని అన్నారు.

తెలంగాణకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం(Kishan Reddy) ఎంతో చేసిందని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో అనేక సంస్థలు ఏర్పాటు చేశారని కిషన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భారీగా మౌలిక వసతుల కల్పన జరుగుతోందని తెలిపారు. చిరు ధాన్యాలపై పరిశోధనలను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో రూ.250 కోట్లతో సిరిధాన్యాల గ్లోబల్‌ విశిష్టతా కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. మిల్లెట్స్ మ్యూజియం, ఫామ్స్ రాబోతున్నాయని అన్నారు. మిల్లెట్స్ పంట ప్రోత్సాహానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు.. హైదరాబాద్‌లో కవచ్‌ ప్రాజెక్ట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌‌ను బలోపేతం చేస్తామని అన్నారు.

Also Read: Bandi Sanjay Kumar : నాన్నకు లేఖ.. కాంగ్రెస్ వదిలిన బాణం

Next Story