MLC ఎన్నికల వేళ కీలక పరిణామం.. CM రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు.

MLC ఎన్నికల వేళ కీలక పరిణామం.. CM రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) లేఖ రాశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువత, పెన్షనర్లతో పాటు కాలేజీ యాజమాన్యాలపై సర్కార్ నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్(Fees Reimbursement) బకాయిలు చెల్లించకపోవడం మూలంగా కాలేజీల మూసివేతకు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. దాంతో విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని వెల్లడించారు. గతేడాది ఎనిమిది వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు.. ఈ ఏడాది మరో 10 వేల మంది రిటైర్ అవుతున్నారు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రూ.11 వేల కోట్ల వరకు చెల్లించాలి.. కానీ ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

14 నెలల కాంగ్రెస్ పాలన(Congress Govt)లో ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. అన్ని వర్గాలను రేవంత్ ప్రభుత్వం వేధిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయులకు దక్కాల్సిన న్యాయమైన హక్కులను కూడా కాలరాస్తున్నారు. ఆఖరుకు ఉద్యోగులకు, పెన్షనర్లకు రొటీన్‌గా అందాల్సిన చెల్లింపులను, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ను కూడా చెల్లించకుండా జాప్యం చేస్తూ వారిని తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమని మండిపడ్డారు.

రుణమాఫీ(Runa Mafi) పూర్తిగా చేయలేదు.. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వడం లేదు. అందరికీ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందడం లేదు. ఇందిరమ్మ ఇళ్లు లేవు. హైడ్రా(Hydraa) పేరుతో ఉన్న ఇళ్లను కూల్చుతున్నారు. ఇలా చెప్పుకుంటే విధ్వంసం తప్ప కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని సీరియస్ అయ్యారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని నిజాయితీగా పనిచేసే ఉద్యోగుల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి సరైందని కాదని అన్నారు.

Next Story