- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్‌ను రక్షిస్తాం.. హైదరాబాద్‌ను కాపాడుతాం: కిషన్ రెడ్డి
ఈసారి ర్యాలీలు, రోడ్ షోలు లేకుండా ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలవడమే ప్రచార ప్రణాళిక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.

దిశ, జూబ్లీహిల్స్: ఈసారి ర్యాలీలు, రోడ్ షోలు లేకుండా ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలవడమే ప్రచార ప్రణాళిక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనలో ఏర్పడిన అధికార పరాజితాలు, మజ్లిస్‌తో అనైతిక సంబంధాలు, అవినీతి మీద తీవ్రంగా విమర్శించారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు లేని ప్రచారం నిర్వహించాలని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ వినూత్న వ్యూహంతో ముందుకు వెళుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. "పెద్ద ర్యాలీలు, రోడ్ షోలు పెట్టుకోకుండా.. ప్రతి బస్తీలో తిరిగుతూ వ్యక్తిగతంగా ప్రతి ఓటరునూ కలిసేలా ప్రచారణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం" అని ఆయన చెప్పారు. ఈ విధంగా ప్రజలతో సర్థకంగా సంబంధం పెంచుకోవడమే లక్ష్యమని, ఇది బీజేపీ విజయావకాశాలను మరింత పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు.
మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు..
జూబ్లీహిల్స్‌లో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మంచినీటి సమస్య ఉందని కిషన్ రెడ్డి ఆరోపించారు. "డ్రైనేజీ వ్యవస్థ సరిగా పని చేయకపోవడంతో రోడ్లపైనే మురుగు నీరు ప్రవహిస్తుంది. ఎక్కడ చూసిన గుంతల రోడ్లు కనిపిస్తున్నాయి.. వీధి లైట్లు లేవు. అధ్వాన్నమైన శానిటేషన్ కారణంగా కంపు కొడుతున్న పరిస్థితి ఉంది" అని ఆయన వివరించారు. ఈ దుస్థితికి బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలనే పూర్తి బాధ్యత అని, రెండు పార్టీల నేతలే ఈ 'పాపానికి' కారణమని ఆరోపించారు. జూబ్లీహిల్స్ సమస్యలను పరిష్కరించడంలో రెండు పార్టీలు వైఫల్యం చెందాయని ఆయన ఆక్షేపించారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈ సారి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. "కాంగ్రెస్ అవినీతి పార్టీ.. కుంభకోణాల చరిత్ర కలిగిన పార్టీ. కాంగ్రెస్, ఎంఐఎం అనైతిక పొత్తును వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు. "ఈ పార్టీల నుంచి జూబ్లీహిల్స్‌ను రక్షిస్తాం.. హైదరాబాద్‌ను కాపాడుతాం.. తెలంగాణ రక్షించుకుంటాం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి వస్తాం" అని ఆయన ధైర్యంగా ప్రకటించారు. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని అన్ని వర్గాల ఓటర్లకు విన్నపిస్తున్న అని అన్నారు.






