Kishan Reddy: పార్టీలో కొత్త రక్తం చేరబోతోంది.. నేతలకు కిషన్ రెడ్డి సంచలన పిలుపు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)లో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు.

Kishan Reddy: పార్టీలో కొత్త రక్తం చేరబోతోంది.. నేతలకు కిషన్ రెడ్డి సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)లో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. శనివారం ఆయన నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో ప్రజలను సంఘటితం చేసేలా ఉద్యమం చేయాలని నేతలను పిలుపునిచ్చారు. కొత్త రక్తం పార్టీలో చెరబోతుంది.. గ్రామ స్థాయి నుంచి జాతీయి స్థాయి వరకు కొత్త నాయకత్వం రాబోతుందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలని సూచించారు.

తెలంగాణలో బీజేపీ(BJP Telangana)కి మంచి భవిష్యత్తు ఉందని ప్రధాని చెప్పారని గుర్తుచేశారు. హామీల అమలులో కాంగ్రెస్(Congress) ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. మీరు ధైర్యంగా ముందుకి వెళ్ళాలని ప్రధాని మాకు భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించినట్లు చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ స్ఫూర్తితో ముందుకి వెళ్దామని సూచించారు. రేపు బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీ, జిల్లాల వారీగా చార్జి‌షీట్ తయారు చేసి విడుదల చేస్తామని అన్నారు.

Next Story