- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy: బీజేపీలో ఎమ్మెల్సీ విక్టరీ జోరు.. కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్తాం: కిషన్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాతీర్పు కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టు లాంటిదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ (Congress) ను ప్రజలు నమ్మడం లేదని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు బీజేపీని ప్రత్యామ్నాయంగా ప్రజలు గుర్తించారని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోగలిగామన్నారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులు మల్క కొమురయ్య(Malka Komuraiah), అంజిరెడ్డిని (Anji Reddy) గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. పదేళ్లు మేమే అధికారంలో ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారన్నారు. బీజేపీని ఓడించాలన్న కాంగ్రెస్ కుట్రలు ఫలించలేదని తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. ఈ విజయాలతో బీజేపీ బాధ్యత మరింతగా పెరిగిందని 'సేవ్ తెలంగాణ.. సపోర్ట్ బీజేపీ' నినాదంతో ముందుకు వెళ్తామని కిషన్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టు:
తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఫలితాలు చెంపపెట్టు లాంటిది కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. బీజేపీపై (BJP) రేవంత్ రెడ్డి ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదని బీజేపీకి అఖండ విజయం కట్టబెట్టారన్నారన్నారు. సీఎం గాలి మాటలకు సమాధానం, సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలుచేయాలని జీవో 317 సమస్యను పరిష్కరించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సమానంగా బీజేపీ సీట్లు గెలుచుకుంది. అప్పట్లో మేం ఇంకాస్త కష్టపడితే మరిన్ని ఎంపీ సీట్లు దక్కించుకునేవాళ్ల అన్నారు.






