Jubilee Hills: ఎంఐఎం పార్టీపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-30 11:46:54  IST  )

జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం(MIM Party) ఎందుకు పోటీ చేయడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Jubilee Hills: ఎంఐఎం పార్టీపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం(MIM Party) ఎందుకు పోటీ చేయడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు పట్టిన చీడ ఎంఐఎం అని కిషన్‌ రెడ్డి(Kishan Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్లాటర్ హౌస్ మాఫియా(Slaughterhouse Mafia)తో పోలీసులు చేతులు కలిపారు.. స్లాటర్‌ హౌస్‌ల వెనుక ఉంది ఎంఐఎం నేతలే.. 39 స్లాటర్ హౌస్‌లపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని కిషన్ రెడ్డి అన్నారు. మజ్లిస్‌ అరాచకాలను ఆపాలంటే జూబ్లీహిల్స్‌లో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. ప్రజల్లో బీజేపీని గెలిపించాలనే ఆలోచన ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు జూబ్లీహిల్స్ నాంది కావాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌‌కు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదని ఆరోపించారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్.. 14న కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లో బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Next Story