Kishan Reddy: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నినాదం ఇదే: కిషన్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-03-31 10:13:28  IST  )

జేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నినాదం ఇదే: కిషన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేసినా తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారన్నారు. ఇవాళ నాంపల్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ (BJP Office Bearers Meeting) జరిగింది. ఈ మీటింగ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సహా ఆ పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి 'స్థానిక సంస్థలు బలపడాలంటే బీజేపీ గెలవాలి' అనే నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) వెళ్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులు తప్ప గ్రామ పంచాయితీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిందేమి లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చలేదని, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై చేతులెత్తేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ రాకుండా ఈ రెండు పార్టీలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని, రాష్ట్ర సమస్యలపై పోరాడాలని, అధికారంలోకి రావాలని ప్రజలు చూస్తున్నారని చెప్పారు.

Read More..

Bandi Sanjay: ఆ విషయాన్ని నిరూపిస్తా.. మీరు సిద్ధమా: సర్కార్‌కు బండి సంజయ్ సవాల్

Next Story