Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ తెరవెనక నాటకాలు..కిషన్ రెడ్డి ఫైర్

by Prasad Jukanti |

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ తెరవెనక నాటకాలు..కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ప్రజల్లోకి వచ్చి ఓట్లడిగే ధైర్యం లేదని అందుకే ఈ రెండు పార్టీలు తెరవెనుక నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. ఉద్యోగులకు కరువు భత్యం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. గురువారం నల్గొండ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని వర్గాలు బీజేపీకి (BJP) అండగా ఉంటాయన్నారు. గతంలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెంటర్ ఇచ్చారు. కానీ నిరుద్యోగులు, యుతను రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ మోసం చేసిందన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఐదు డీఏలు బాకీ పడిందన్నారు.

అందుకే బీఆర్ఎస్ పోటీకి దూరం:

ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నారు. పెన్షనర్లు డీఏ అమలు చేయని కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలోనే పీఆర్సీ కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ నివేదిక ప్రతిపాదనలు అమలు చేయమంటే ఉద్యోగ సంఘాల్లో చీలక తెచ్చారే తప్ప అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 14 నెలలు అవుతున్నా ఇప్పటి వరకూ అతీగతీ లేదన్నారు. 2023 జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నా ఇంతవరకు అమలు కావడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని పెడితే ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తారనే భయంతోనే బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలపలేదని ఎద్దేవా చేశారు.

Next Story