- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy: రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి: కిషన్ రెడ్డి
బీఆర్ఎ, కాంగ్రెస్ దొందు దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో (MPTC, ZPTC Elections) గుణపాఠం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (G.Kishan Reddy) అన్నారు. పార్టీ గుర్తులపై జరగబోయే ఈ ఎన్నికల్లో బీజేపీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇందుకోసం సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వీటితో పాటు జీహెచ్ఎంసీ ఇతర మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మాట్లాడిన కిషన్ రెడ్డి బీఆర్ఎ, కాంగ్రెస్ దొందు దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు.
సిగ్గులేకుండా మాట మారుస్తారా?:
పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని అబద్ధాలు చెబుతున్నారని, ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఎలా తీర్పు ఇచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాజ్యాంగం అంటే గౌరవం లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి సిగ్గులేకుండా కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఇవాళ కోర్టు తీర్పు నేపథ్యంలో తాము ఫిరాయించలేదని మాట మారుస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది నీచమైన చరిత్ర అని ఈ రెండు పార్టీలు తెలంగాణ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. స్పీకర్ తీర్పు తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదని స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నారు. నరేగా చట్టాన్ని కేంద్రం మరింత పటిష్టం చేసిందన్నారు.






