Kishan Reddy: ఎంఐఎం అండతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయాలు: కిషన్ రెడ్డి

by Prasad Jukanti |

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి విమర్శించారు.

Kishan Reddy: ఎంఐఎం అండతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయాలు: కిషన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్,బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ రెండు పార్టీలపై నమ్మకం లేదన్నారు. ఇవాళ హైదరాబాద్ అమీర్ పేట్ లో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఎంఐఎం అండతో గెలుస్తామనే ధీమాతో ఉన్నారని అందుకే మజ్లీస్ పార్టీ లీడర్లకు వంగి వంగి దండాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే ఆలోచన వీరికి లేదన్నారు.

Next Story