- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ సీఎం కాకముందే ఆ పని పూర్తిచేశా.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ బ్యాడ్ ఫ్యామిలీస్ అని అన్నారు. ఈ రెండు ఫ్యామిలీస్ తెలంగాణకు పట్టిన శని అని విమర్శించారు. తాను మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. ఎక్కడ అడ్డుకున్నానో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్ అండ్ టీతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒప్పందమే చేసుకోలేదని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేయలేదని విమర్శించారు. మరోవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఆర్ఆర్ఆర్ మంజూరు అయిందని అన్నారు. తానే స్వయంగా ప్రధాని మోడీని కలిసి ట్రిపులార్‌ను మంజూరు చేయించానని కిషన్ రెడ్డి చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులను అడ్డుకున్నానని మాట్లాడుతున్నారు.. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదు అని అన్నారు. హైడ్రా నిజంగానే న్యాయం వైపు ఉంటే.. ఆక్రమణలనే కూల్చివేస్తే.. ఇప్పటివరకు ఎంఐఎం కాలేజీలను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. మూసీ బాధితులకు న్యాయం చేయాలనుకుంటున్నామని అన్నారు.






